ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప-2' సినిమాకు బిగ్ షాక్ తగిలింది. బెంగళూరులో 'పుష్ప-2' సినిమా మిడ్ నైట్, ఎర్లీ మార్నింగ్ షోలు ప్రదర్శించవద్దని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 6 గంటలకు ముందు షోలు ప్రదర్శించడం చట్టవిరుద్ధమని కన్నడ ఫిల్మ్ ప్రొడ్యూసర్ల ఫిర్యాదుతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే షోలు వేసేందుకు పలు చోట్ల మూవీ యూనిట్ ఏర్పాటు చేసింది. తాజా ఆదేశాలతో అభిమానులకు నిరాశే ఎదురైంది.