AP: తుఫాన్ ఎఫెక్ట్.. సముద్రం అల్లకల్లోలం

66చూసినవారు
ఏపీలో ఫెంగల్ తుఫాన్ ఉగ్రరూపం దాల్చింది. సముద్ర తీర ప్రాంతాల్లో భారీ ఈదురు గాలులు వీస్తున్నాయి. కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి సముద్ర తీరం, విశాఖ సముద్ర తీరంలో ఫెంగల్ తుఫాన్ ప్రభావం భారీగా ఉంది. ఉప్పాడ నుంచి కాకినాడ వైపుగా వెళ్లే బీచ్‌ రోడ్‌లో భారీగా సముద్ర అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. విశాఖలో వైఎంసీఏ నుంచి సబ్ మెరైన్ మ్యూజియం వరకు సముద్ర తీరం కోతకు గురైంది. సముద్రం భీకర రూపం దాల్చింది.

సంబంధిత పోస్ట్