AP: విజయనగరం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు విడుదల చేశారు. భోగాపురం మండలం పోలిపల్లి వద్ద కారు అదుపుతప్పి డివైడర్ దాటి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. మృతులు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వడ్డే అభినవ్, మణిమాల, ద్రవిడ కౌశిక్, వాహన డ్రైవర్ జయేశ్‌లుగా పోలీసులు గుర్తించారు. తీవ్రంగా గాయపడ్డ లారీ డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.