మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సెహోర్ జిల్లా బుధ్నిలో శనివారం గుర్తుతెలియని వాహనం రోడ్డుపై వెళ్తున్న ఆవులను ఢీకొట్టింది. ఈ ఘటనలో 12 ఆవులు చనిపోగా.. మరికొన్ని ఆవులు తీవ్రంగా గాయపడ్డాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.