APSRTC ఉద్యోగుల నిరసనలు వాయిదా పడ్డాయి. ఉద్యోగ భద్రత సర్క్యులర్ యథావిధిగా అమలు చేయడంతో పాటు పలు డిమాండ్లను పరిష్కరించాలని ఈ నెల 19, 20 తేదీన ఆర్టీసీ డిపోలు, వర్క్ షాపుల వద్ద ధర్నాలకు EU పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి హామీ ఇవ్వడంతో వెనక్కి తగ్గారు. ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తామని మంత్రి ఫోన్లో చెప్పారని EU రాష్ట్ర అధ్యక్షుడు దామోదరావు తెలిపారు.