కడపలో ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీని నిర్వహించనున్నారు. నవంబర్ 10న ప్రారంభమై 15న ర్యాలీ ముగుస్తుందని ప్రకటించారు. ఏర్పాట్లకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ ర్యాలీలో కర్నూలు, నెల్లూరు, అనంతపురం, గుంటూరు,
వైఎస్ఆర్, ప్రకాశం, చిత్తూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, తిరుపతి, అన్నమయ్య, సత్యసాయి జిల్లాలకు చెందిన అభ్యర్థులు హాజరుకానున్నారు. అగ్నివీర్‌కు 8వ తరగతి, మిగతా వాటికి టెన్త్ ఉత్తీర్ణత కావాలి.