AP: విజయవాడలో జలజీవన్ మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్ షాప్‌లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొని మాట్లాడారు. ‘మనిషికి రోజుకు సగటున 55 లీటర్ల పరిశుభ్రమైన నీటిని ఇవ్వాలనేది ప్రధాని కల. ప్రతి ఒక్కరికి నీటి సరఫరా చేయాలనే లక్ష్యంతో జలజీవన్ మిషన్ ప్రారంభమైంది. నీటి సరఫరాలో వచ్చే ఇబ్బందుల పరిష్కారానికి అమృతధార కింద విధివిధానాల రూపకల్పన చేపడుతున్నాం. ఉద్యోగులే కాకుండా ప్రజలను కూడా ఇందులో భాగస్వాములు చేయాలి.’ అని పవన్ అన్నారు.