నష్టాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

52చూసినవారు
నష్టాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 100 పాయింట్లకు పైగా నష్టపోగా.. నిఫ్టీ 24,300 పాయింట్ల కింద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 156 పాయింట్లు తగ్గి 80,542 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 41 పాయింట్లు కుంగి 24,294 వద్ద కొనసాగుతోంది. మరోవైపు ఈ రోజు వెలువడే అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల ప్రకటన కోసం మదుపర్లు ఎదురుచూస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్