జపాన్‌కు చెందిన ‘డైకిన్’ ఇండస్ట్రీస్ ఏపీలోని శ్రీ సిటీలో ఏసీల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. తైవాన్‌కు చెందిన రెచి ప్రెసిషన్ భాగస్వామ్యంతో కలిసి రూ.1,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ ప్లాంట్‌లో ఏసీలలో వినియోగించే రోటరీ కంప్రెసర్లను తయారుచేసి విదేశాలకు ఎగుమతి చేయనుంది. రెండు మూడు నెలల్లో ఈ ప్లాంట్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.