పెరుగు, కలబందను అనేక చర్మ సంబంధిత సమస్యలకు ఉపయోగిస్తారు. ఈ రెండింటి మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేయడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ఒక గిన్నెలో 2 స్పూన్ల పెరుగు, అలోవెరా జెల్ తీసుకొని దానికి 2 చుక్కల టీ ట్రీ ఆయిల్, 1/2 టీస్పూన్ జోజోబా ఆయిల్ కలిపి జుట్టుకు అప్లై చేయాలి. అరగంట తర్వాత జుట్టును కడగాలి. దీంతో జుట్టులో చుండ్రు సమస్య తగ్గుతుంది. ఇది జుట్టులో కొల్లాజెన్‌ను పెంచుతుంది. రాడికల్ డ్యామేజ్ నుండి రక్షిస్తుంది.