ఒంగోలులో శిశువు విక్రయం ఘటన కలకలం రేపుతోంది. ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో కన్న కూతురుని రూ.10 వేలకు అంగన్వాడీ కార్యకర్త మంజుల అమ్మేసింది. ఖమ్మం జిల్లా కల్లూరులో ఉండే బాలసుందరరావుకి మధ్యవర్తుల ద్వారా కూతురుని విక్రయించింది. విషయం తెలుసుకున్న పోలీసులు.. మంజులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అంతే కాకుండా శిశువును తిరిగి క్షేమంగా తల్లి వద్దకు తీసుకు వచ్చారు.