సుమారు 5 కిలోల పశువుల పేడను పల్చటి గుడ్డలో తీసుకొని 20 లీటర్ల నీటితో ఉన్న బకెట్లో 12 గంటల పాటు వేలాడగట్టాలి. లీటరు నీటిలో 50 గ్రాముల సున్నం వేసి ఒక రాత్రంతా నానబెట్టుకోవాలి. మరుసటి రోజు గుడ్డలో నానబెట్టి ఉంచిన పేడను గట్టిగా నీటిలోకి పిండుకోవాలి. దీనిలోకి 5 లీటర్ల పశువుల మూత్రాన్ని, నానబెట్టి ఉంచిన సున్నాన్ని కలుపుకొని బాగా కలుపుకోవాలి. 3, 4 రోజులలోపు బీజామృతం ద్రావణాన్ని విత్తన శుద్ధికి వాడుకోవచ్చు.