అధిక వర్షాలలో కూరగాయ పంటల పొలాల్లో అధికంగా ఉన్న నీటిని వెంటనే తీసి బయటకు పంపే ఏర్పాటు చేయాలి.పడిపోయిన మొక్కలను జాగ్రత్తగా నిలబెట్టి మొక్క మొదలు చుట్టూ మట్టిని వేయాలి. వర్షాకాలంలో తప్పనిసరిగా బోదెలపై లేదా బెడ్లపై నాటుకోవాలి. వర్షాలు ఆగిన వెంటనే 19:19:19 లేదా 13:0:45 లేదా యూరియా లేదా మెగ్నీషియం సల్ఫేట్ వంటి పోషకాలను పంటపై లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి పిచికారి చేయాలి.