ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, ఆరుగురికి తీవ్ర గాయాలు (వీడియో)

62చూసినవారు
TG: జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కోరుట్ల పట్టణం సమీపంలోని పాత బస్టాండ్‌లో గురువారం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల ట్రాక్టర్‌ను బోధన్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులకు తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, హుటాహుటిన క్షతగాత్రులను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్