విజయవాడ వరద బాధితులు రోడ్డెక్కారు. నష్ట పరిహారం ఇవ్వట్లేదని కుమ్మరిపాలెం సెంటర్‌లో రోడ్డుపై ధర్నాకు దిగారు. వరదల్లో అన్ని కోల్పోయి రోడ్డున పడిన తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే కలెక్టర్ రావాలని నినాదాలు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళన విరమించాలని బాధితులను కోరారు. రోడ్డుపై ధర్నా చేయడంతో విజయవాడలో మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.