మాజీ సీఎం జగన్ పార్టీలో కీలక మార్పులు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీలో పలువురికి కొత్తగా బాధ్యతలు అప్పగించారు. తాజాగా ప్రకాశం జిల్లా బాధ్యతల స్వీకరణకు బాలినేని నిరాకరించారు. వైసీపీని బాలినేని వీడుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఇక పార్టీ ఓటమి తరువాత పలువురు నేతలు సజ్జల పైన విమర్శలు చేసారు. దీంతో..సజ్జలను పార్టీ అంతర్గత వ్యవహారాలను చూడాలని నిర్దేశించినట్లు తెలుస్తోంది. తానే పార్టీ నేతలతో నేరుగా టచ్ లో ఉంటానని కలిసిన ముఖ్యులకు జగన్ స్పష్టం చేస్తున్నారు.