బల్లికురవ మండలం మల్లాయపాలెం అంగన్వాడీ కార్యకర్త నాగమణి గురువారం ఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఉన్నతాధికారుల చేతుల మీదుగా ఆమె ఉత్తమ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఢిల్లీలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో తాను పాల్గొనే అవకాశం రావడం సంతోషంగా ఉందని అన్నారు.