అమరావతి లోని అసెంబ్లీ నందు గురువారం అద్దంకి టిడిపి ఎమ్మెల్యే, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వైసిపి సోషల్ మీడియా పై విరుచుకుపడ్డారు. వైసిపి సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లపై అసభ్యకరంగా వ్యాఖ్యలు చేస్తే సహించాలా అని అన్నారు. సాక్షాత్తు షర్మిలపై కూడా అసభ్యకరంగా పోస్టులు పెట్టారని రవికుమార్ విమర్శించారు.