గోకులాలకు దరఖాస్తు చేసుకోండి

82చూసినవారు
కొరిసపాడు మండలంలోని రైతులు, పశు పోషకులు ఉపాధి హామీ పథకం ద్వారా గోకులాల నిర్మాణాలకు దరఖాస్తు చేసుకోవాలని మండల పశు వైద్యాధికారి డాక్టర్ వెంకట్రావు సోమవారం మీడియా ప్రకటన ద్వారా తెలియజేశారు. పశువుల షెడ్లకు 90 శాతం, గొర్రెలు, మేకలు, కోళ్ల షెడ్లకు 70 శాతం రాయితీ ప్రభుత్వం ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులు, సంచార జాతులు, ఉపాధి హామీ జాబ్ కార్డు ఉన్నవారు అర్హులని తెలిపారు.

సంబంధిత పోస్ట్