తల్లిపాలు పై అవగాహన కార్యక్రమం

82చూసినవారు
తల్లిపాలు పై అవగాహన కార్యక్రమం
కొరిశపాడు మండలం మేదరమెట్లలోని గ్రామ సచివాలయం-1 పరిధిలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సోమవారం తల్లిపాలు వారోత్సవాలలో భాగంగా బాలింతలు, గర్భిణీలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ఆరోగ్య విస్తరణ అధికారి బ్రహ్మానందం పాల్గొని తల్లిపాలు యొక్క విశిష్టతను వివరించారు. బిడ్డకు తల్లిపాలు ఆరోగ్యకరమని ఆయన పేర్కొన్నారు. తల్లిపాలతో బిడ్డలు ఆరోగ్యంగా ఎదుగుతారని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్