కొరిసపాడు మండలం కొరిసపాడు పోలీస్ స్టేషన్ ఎస్సై గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సురేష్ గురువారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ను చిలకలూరిపేట లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిధిలో శాంతి భద్రతలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని మంత్రి ఎస్సై కు సూచించారు. ఏమైనా సమస్య ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు.