కొరిసపాడు మండలం మేదరమెట్లలోని పంచాయతీ కార్యాలయం నందు శుక్రవారం ఉపాధి హామీ పనులపై గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి ఎంపీడీవో సురేష్ బాబు పాల్గొని మాట్లాడారు. గ్రామాలలో పనులు గుర్తించి ప్రజలకు ఉపాధి కల్పించేందుకు కూటమి ప్రభుత్వం గ్రామ సభలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని సురేష్ బాబు తెలియజేశారు. ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యమని అన్నారు.