అద్దంకి పట్టణం, భవాని సెంటర్ నందు గురువారం సాయంత్రం అద్దంకి ఎస్సై ఖాదర్ బాషా విజిబుల్ పోలీస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై వాహన చోదకులకు ట్రాఫిక్ నిబంధనల పై, సూచనలు సలహాలు చేయడం జరిగింది. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, వేగ నియంత్రణ పాటించాలని, వాహన చోదకులకు తెలిపారు. సందర్భంగా సరైన పత్రాలు లేని వాహనదారులకు జరిమానా విధించారు.