అద్దంకి మండల పరిధిలో, 152 మంది ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా రూ. 2.95 కోట్లు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ పంపిణీ కార్యక్రమం గురువారం ఉదయం ప్రారంభించామని ఎంపీ.డీ.వో సత్యనారాయణ తెలియజేశారు.1 తేదీనే 100 శాతం పెన్షన్ పంపిణీ లక్ష్యంగా పెట్టుకుని, విధులను నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. 7,118 మంది పెన్షన్ లబ్ధిదారులకు,ఇంటి వద్దనే పెన్షన్ అందిస్తామని,లబ్ధిదారులు సిబ్బందికి అందుబాటులో ఉండాలని సూచించారు.