కారు-బైకు ఢీ..వ్యక్తికి తీవ్ర గాయాలు

84చూసినవారు
కారు-బైకు ఢీ..వ్యక్తికి తీవ్ర గాయాలు
కారు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్న ఘటనలో వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన బాపట్ల పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం సోమవారం బాపట్ల- గుంటూరు రహదారిపై గుంటూరు వైపు నుంచి వస్తున్న కారు, బాపట్ల వైపు నుంచి వెళ్తున్న ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడుకి తీవ్ర గాయాలు కాగా స్థానికులు ఆటోలో అతడిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్