రేపు చిలకలూరిపేట పురపాలక సంఘం వార్షిక బడ్జెట్ సమావేశం

68చూసినవారు
రేపు చిలకలూరిపేట పురపాలక సంఘం వార్షిక బడ్జెట్ సమావేశం
చిలకలూరిపేట మైలవరపు గుండయ్య మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో సోమవారం పురపాలక సంఘం వార్షిక బడ్జెట్ సమావేశం జరుగుతుందని ఛైర్మన్ షేక్ రఫాని ఆదివారం తెలిపారు. ఈ సమావేశంలో 2024-25 సంవత్సరపు సవరణ బడ్జెట్ అంచనాలు, 2025-26 సంవత్సరపు బడ్జెట్ అంచనాలు కౌన్సిల్ ఆమోదం కోసం ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా వంటి 26 అంశాల ఎజెండాను సమావేశంలో చర్చించి ఆమోదించనున్నామన్నారు.

సంబంధిత పోస్ట్