చిలకలూరిపేటలో ఐసిఐసిఐ బ్యాంకును బుధవారం స్థానిక ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు సందర్శించారు. కొన్ని రోజులుగా బ్యాంకులో ఖాతాదారుల నగదును బ్యాంక్ యాజమాన్యం చోరీ చేసిందని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బ్యాంకు వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం బాధితులను పరామర్శించి ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు.