బోరుగడ్డ అనిల్ ను పోలీసులు మరోసారి కస్టడీలోకి తీసుకున్నారు. ఏలూరు జిల్లా, వెలూరుపాలెం పోలీస్ స్టేషన్ లో నమోదైన ఓ కేసుకు సంబంధించి రెండు రోజులు పోలీస్ కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. ఇప్పటికే గుంటూరులోని ఓ చర్చి కోశాధికారిని డబ్బులు డిమాండ్ చేసి బెదిరించిన కేసులో అనిల్ రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉండగా ఏలూరు పోలీసులు జైలుకు చేరుకొని అక్కడి నుంచి ఆయనను శుక్రవారం కస్టడీకి తీసుకున్నారు.