విజయవాడ డివిజన్ పరిధిలో ఇంజినీరింగ్ పనులు కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్లు గుంటూరు మండల రైల్వే అధికారి గురువారం తెలిపారు. ఈనెల 4 నుంచి 11వ తేదీ వరకు విజయవాడ-మాచర్ల(07781), 5 నుంచి 12వ వరకు మాచర్ల-విజయవాడ (07782) రైళ్లను పూర్తిగా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. తెనాలి-విజయవాడ-కాజీపేట మీదుగా వెళ్లే మరికొన్ని రైళ్లు గుంటూరు-పగిడి పల్లి మీదుగా మళ్లింపు మార్గంలో నడుస్తాయన్నారు.