సౌత్ సెంట్రల్ రైల్వే డీఆర్ఎం కప్-2024 ఆటల పోటీలు గుంటూరు వేదికగా గురువారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. గుంటూరు పట్టాభిపురంలోని డీఆర్ఎం కార్యాలయం ప్రాంగణంలో కలెక్టర్ నాగలక్ష్మి ఈ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగులకు ఒత్తిడి నుంచి విముక్తి కోసం ఇటువంటి పోటీలు ఉపయోగపడతాయని చెప్పారు. జేసీ భార్గవ్ తేజ, డీఆర్ఎం రామకృష్ణ ఇతర అధికారులు, క్రీడాకారులు పాల్గొన్నారు.