అఖిల భారత యాదవ మహాసభ వార్షిక సమావేశం ఆదివారం గుంటూరులో ఘనంగా జరిగింది. అరండల్ పేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యాదవ మహాసభ ప్రతినిధులు సోం ప్రకాశ్, వెంకటేశ్, నాగమల్లేశ్వరి, వీరశేఖర్ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ యాదవుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయంగా ప్రాధాన్యం ఇచ్చే వారికే అండగా ఉంటామని చెప్పారు. యాదవులంతా ఐక్యంగా ముందుకు నడవాలని పిలుపునిచ్చారు.