భర్తపై భార్య ఫిర్యాదు చేసిన ఘటనపై బుధవారం నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు గుంటూరు కృష్ణబాబు కాలనీకి చెందిన ధనలక్ష్మితో అచ్యుతరావుకు 15ఏళ్ల కిందట వివాహమైంది. తరచూ తాగివచ్చి కొడుతున్నాడని, ఈ నెల 22న మద్యం మత్తులో తనపై దాడిచేయడంతో కంటికి దెబ్బ తగిలిందని ఆమె ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ వీరానాయక్ చెప్పారు.