దాచేపల్లి మండలం పెద్దగార్లపాడు గ్రామ శివారులోని ఓ పొలంలో కోడి పందాల స్థావరాలపై బుధవారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రెండు కోడి పుంజులు, రూ. 17, 130 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ సౌందర్ రాజన్ చెప్పారు. అనంతరం వారిపై నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.