మాచవరం మండలం వేమవరం గ్రామానికి చెందిన సైదులు నివాసంలో గుర్తుతెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న రూ2. లక్షల డబ్బు మాత్రమే దొంగిలించారని బుధవారం మాచవరం ఎస్ఐ సతీశ్ చెప్పారు. ఆయన పోలీస్ స్టేషన్లో మాట్లాడుతూ డబ్బుతో పాటు పోయిందనుకున్న బంగారం బీరువాలోనే వేరొక చోట కనిపించిందని, 13సవర్ల బంగారం పోలేదన్నారు. కాగా గ్రామంలో తెలిసిన వాళ్లే ఈ డబ్బును అపహరించారని బాధితులు వాపోయారు.