అఖిల భారత విద్యార్థి సమాఖ్య గురజాల నియోజకవర్గ నూతన అధ్యక్షులుగా వేపురి మధు,కార్యదర్శిగా జగతాపు సాయి ఎంపికయ్యారు. గురజాల నియోజకవర్గంలో భవన్ నందు అఖిల భారత విద్యార్థి సమాఖ్య గురజాల నియోజకవర్గ నిర్మాణ మహాసభను మంగళవారం నిర్వహించారు. ఈ సభకు పట్టణ కార్యదర్శి కృష్ణ నాయక్ హాజరయ్యారు. విద్యా సమస్యలు పరిష్కారం విద్యార్థుల పోరాటం వల్లే జరుగుతుందని, పేద విద్యార్థుల ఉచిత విద్య కొరకు పోరాటం కొనసాగిస్తూనే ఉందని అన్నారు.