సీఎస్ పురంలోని ప్రభుత్వ పాఠశాలల వద్ద ఈనెల 8వ తేదీన పాఠశాల యాజమాన్య కమిటీలను ఎన్నుకునేందుకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎంఈవో కొండారెడ్డి గురువారం తెలిపారు. నోటిఫికేషన్ జారీ చేయడం జరుగుతుందని ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. మధ్యాహ్నం పాఠశాలల ఓటర్ల జాబితా ప్రచురించి నోటీసు బోర్డులో ప్రదర్శించడం జరుగుతుందని ప్రస్తుతం ఉన్న కమిటీల గడువు ముగిసిందన్నారు.