
కనిగిరి: కలెక్టర్ ను కలిసిన హ్యూమన్ రైట్స్ అధ్యక్షురాలు
ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాను ఒంగోలులో కలెక్టర్ కార్యాలయంలో ప్రకాశం జిల్లా ఇండియన్ హ్యూమన్ రైట్స్ మహిళా అధ్యక్షురాలు మద్దిశెట్టి భారతి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. హ్యూమన్ రైట్స్ కు సంబంధించి జిల్లాలోని పలు అంశాలను కలెక్టర్ కు భారతి వివరించారు. ఎదురవుతున్న సమస్యలను ప్రస్తావించి వాటిని పరిష్కరించాలని కోరగా, కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లుగా భారతి తెలిపారు.