కూతురు వరసైన 15 ఏళ్ల బాలికపై 50 ఏళ్ల వైకాపా ఎంపీటీసీ నాలుగు నెలలుగా లైంగిక దాడికి పాల్పడుతున్న ఘటన కారంపూడి మండలంలోని ఓ గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల వివరాల మేరకు. మండలంలోని వైకుంటపురం గ్రామానికి చెందిన ఎంపీటీసీ చలంచర్ల సుబ్బారావు బాలికకు మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేస్తున్నాడు. ఆదివారం బాలికపై మరోమారు అత్యాచారం చేస్తుండగా బంధువులు చూసి అతనిపై దాడి చేశారు.