మాచర్ల: అన్న క్యాంటీన్ లో గంజాయి మొక్క కలకలం

66చూసినవారు
మాచర్ల అన్న క్యాంటీన్ లో గంజాయి మొక్క పెరుగుతూ ఉందని సోషల్ మీడియాలో వార్త వైరల్ అయిన నేపథ్యంలో ఆదివారం ఆ మొక్కను అక్కడి నుంచి తొలగించి పట్టణ పోలీస్ స్టేషన్ కు పోలీసులు తరలించారు. క్యాంటీన్ వద్ద ఏర్పాటు చేసిన గార్డెన్ మొక్కలతోపాటు గంజాయి మొక్క సైతం ఉండటం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ మొక్క ఎవరైనా కావాలని పెంచుతున్నారా లేదా గార్డెన్ మొక్కలతోపాటు వచ్చి చేరిందా అనేది విచారణలో తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్