కారంపూడి మండలంలోని చినగార్లపాడులో ఇంటి ముందు నిలిపి ఉంచిన ద్విచక్రవాహనాన్ని గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. గ్రామానికి చెందిన హరికృష్ణ ఆదివారం రాత్రి మధ్యాహ్నం ఇంటి ముందు వాహనాన్ని నిలిపి భోజనానికి వెళ్లాడు. అనంతరం బయటకు వచ్చి చూడగా అది కనిపించక స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై అమీర్ సోమవారం తెలిపారు.