ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసిన ఘటనపై భాదితులు ఎస్పీ శ్రీనివాసరావుకు సోమవారం ఫిర్యాదు చేశారు. బొల్లాపల్లి మండలం గండిగనుమల గ్రామానికి చెందిన కేతావత్ సూర్య నాయక్ భార్యకు ఉద్యోగం ఇప్పిస్తానని కొమ్ము పవన్ కుమార్ అని వ్యక్తి రూ. 3,50,000 తీసుకుని మోసం చేసాడు. తిరిగి డబ్బులు అడిగితే చంపుతానని బెదిరిస్తున్నాడని భాదితులు నరసరావుపేటలోని పోలీస్ కార్యాలయంలో ఎస్పీని కలిసి ఫిర్యాదు ఇచ్చారు.