నరసరావుపేట టౌన్ పరిధిలోని పటాసుల దుకాణాలను బుధవారం ఆర్డీవో మధులత, ఎంఆర్ వేణుగోపాల్, పోలీసులు తనిఖీ నిర్వహించారు. పటాసుల భద్రత, చట్టపరమైన నిబంధనలు పాటిస్తున్నారో లేదో దుకాణాలను పరిశీలించారు. ఆర్డీవో మాట్లాడుతూ. పటాసుల నిల్వ, ప్రదర్శనలో భద్రతా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలన్నారు. నిషేధిత ఉత్పత్తులు విక్రయించడం లేదా నిల్వ చేయకూడదన్నారు.