ఉపాకుట్ర కేసులో అన్యాయంగా పది సంవత్సరాల పాటు జైలు పాలై, తీవ్ర అనారోగ్యంతో ఇటీవల అమరుడైన కామ్రేడ్ ప్రొఫెసర్ జి. ఎన్. సాయిబాబా సంస్మరణ సభను జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి జి. రామకృష్ణ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో శనివారం నరసరావుపేట గాంధీ పార్క్ సెంటర్ లో కరపత్రాన్ని విడుదల చేశారు. ఈనెల 17న ఒంగోలు, సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆదివాసి హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో ఈ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.