కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అఖిల భారత రైతు సంఘాల ఉద్యమానికి మద్దతుగా సోమవారం పల్నాడు జిల్లా నరసరావుపేట గాంధీ పార్క్ సెంటర్లో రైతు సంఘాల నాయకులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతుల ప్రాణాలు కాపాడాలని, రైతులపై లాఠీచార్జి, భాష్పా వాయువు ప్రయోగించడం దుర్మార్గమని, వారితో చర్చలు జరిపి రైతుల న్యాయమైన డిమాండ్లను ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.