ప్రభుత్వ జూనియర్ కళాశాల భూమిని ఆక్రమించి అనుమతి లేకుండా వేసిన అక్రమ మెటల్ రోడ్డును తొలగించుటకు ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల భూముల పరిరక్షణ కమిటీ కన్వీనర్ కృష్ణా నాయక్ కోరారు. సోమవారం నరసరావుపేట కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి కలెక్టర్ కి మెమోరాండం అందజేశారు. పిడుగురాళ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల 17 సెంట్ల భూమిని గంధం హరికృష్ణ, జొన్నలగడ్డ శ్రీనివాసరావు ఆక్రమించారన్నారు.