గుర్తుతెలియని వాహనం ఢీకొని మూడు పాడి గేదెలు మృతి

71చూసినవారు
కారంచేడు మండలం కొడవలివారిపాలెంలోని ముగ్గురు పశుపోషకులకు చెందిన మూడు పాడి పశువులు ఇంకొల్లు-కడవకుదురు రోడ్డులో భీమవరం గ్రామ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని సోమవారం రాత్రి మృతి చెందాయి. స్థానికులు పశువుల చెవులకు ఉన్న ట్యాగ్ నెంబర్ల ఆధారంగా గేదెల యజమానులకు మంగళవారం ఉదయం తెలియజేయడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొన్నారు. ఈ ఘటనపై వారు ఇంకొల్లు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు అయింది.

సంబంధిత పోస్ట్