అమరావతి మండల పరిధిలోని గుంటూరు రోడ్డు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో డ్రంక్ అండ్ డ్రైవ్ విస్తృత తనిఖీలు సోమవారం రాత్రి ఎస్ఐ అమీర్ నిర్వహించారు. వాహనాల పత్రాలను తనిఖీ చేసి సరైన పత్రాలు లేని వారికి చలానాలు రాశారు. రోడ్డుపై వచ్చే వాహనాలు చూసుకొని ప్రతి ఒక్కరు సిగ్నల్స్ పాటిస్తూ వెళ్లాలని ఆయన వాహనదారులకు సూచించారు.