అమరావతి పోలీసు స్టేషన్ సమీపంలో ఉచిత న్యాయ సహాయ సేవలు అందుబాటులో ఉన్నాయని ఆదివారం ప్రజల అవగాహన కల్పించేలా ఫ్లెక్సీ బోర్డు ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ 15100కి ఫోన్ చేసి సలహాలు, సూచనలు పొందవచ్చని కమిటీ సభ్యులు తెలిపారు. వివిధ సమస్యల మీద వచ్చే ప్రజలు ఉచిత న్యాయ సలహాలను పొందాలని కోరారు. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండేలా ఈ సేవలో తీసుకువచ్చారన్నారు.