రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను గెలిపించాలని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కోరారు. పెదకూరపాడులో బుధవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రతి ఒక్కరూ విధిగా ఓటు హక్కు ఉపయోగించుకోవాలని అన్నారు. పట్టభద్రుల సమస్యలను ఆలపాటి పరిష్కరించే విధంగా కృషి చేస్తారని అన్నారు.