పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరు మండలం క్రోసూరు అమరావతి రోడ్డు లోని పాలిటెక్నిక్ కాలేజీ వద్ద ఉన్న వరద ప్రవాహం శనివారం ఉదృతంగా ప్రవహిస్తుంది. కాలేజీ చుట్టూ వరద నీరు ప్రవహిస్తుంది. అమరావతి వెళ్ళటానికి ఉన్న ఏకైక రహదారిలో నీరు ప్రవహిస్తుండంతో రాకపోవకులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ వద్ద పోలీసులను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.